Personal Loan: పర్సనల్ లోన్ అంటే వ్యక్తిగత అవసరాల కోసం తీసుకునే రుణం. ఇది బ్యాంకులు లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లు వడ్డీ రేటు, పదవీ కాలం వంటి నిబంధనలు, షరతుల ఆధారంగా ఇస్తాయి. ఈ రుణాన్ని గృహ నిర్మాణం, వివాహం, విద్య, వైద్య అవసరాలు, వెకేషన్, లేదా ఇతర వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించవచ్చు. వ్యక్తిగత రుణాన్ని అనుకోని ఖర్చులు, వివాహ ఖర్చులు, విద్య ఖర్చులు, సేవింగ్ లేకుండా ఖర్చులు, పాత రుణాలను క్లియర్ చేయడానికి, లేదా వ్యాపారం కోసం తీసుకుంటారు. మీ అనుకోని ఖర్చులకి డబ్బు అవసరం ఇబ్బంది పెడుతుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటె ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా రుణాలు చాలా సులభంగా పొందవచ్చు. మొబైల్ యాప్ ద్వారానే ఇంట్లో కూర్చొని లోన్ పొందే అవకాశాలు ఎన్నో కంపెనీలు మనకు అందిస్తున్నాయి. అందులో ఒకటి Navi App.
Navi App అనేది ఒక డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫారమ్, Navi Finserv Pvt Ltd అనే కంపెనీ పేరుతో లోన్ సర్వీస్ ను అందిస్తుంది. ఈ యాప్ ద్వారా మీరు మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో కూర్చుని, కొన్ని నిమిషాల్లోనే లోన్ పొందవచ్చు. నవి యాప్‌లో పర్సనల్ లోన్ పొందడం చాలా సులభం. మీరు ₹10,000 నుండి ₹20 లక్షల వరకు లోన్ పొందగలరు. ఈ లోన్ మొత్తాన్ని మీ ఆర్థిక అవసరాల బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు తీసుకున్న లోన్ మొత్తాన్ని 6 నుండి 72 నెలల వరకు ఈఎంఐలుగా చెల్లించవచ్చు. ఇప్పుడు, Navi Appలో లోన్ ఎలా పొందాలో, ఎంత వరకు లోన్ పొందగలరో, ఎవరు తీసుకోవచ్చో, ఎలా అప్లై చేయాలి, అవసరమైన డాక్యుమెంట్లు ఏమిటి, అలాగే నావి యాప్ లోన్ యొక్క ఫీచర్లు మరియు ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
నవి యాప్ ద్వారా లోన్ పొందడం చాలా ఈజీ మరియు వేగవంతమైన ప్రాసెస్. మీ ఆధార్, పాన్ కార్డు తో సింపుల్ స్టెప్పులు ఫాలో అవుతూ లోన్ ను సెలెక్ట్ చేసుకుని, మీ బ్యాంక్ ఖాతాలో ఇన్‌స్టంట్‌గా పొందగలరు. మీ అవసరాలకు తగ్గట్టుగా సరైన మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుని, ఫ్లెక్సిబుల్ EMI ఆప్షన్లతో టెన్షన్ లేకుండా రీపేమెంట్ చేయవచ్చు. మీ ఆర్థిక అవసరాలకి, నవి యాప్ ఒక బెస్ట్ సొల్యూషన్ అని చెప్పవచ్చు.
ఈ ప్రాసెస్ లో ఒక ముఖ్యమైన విషయం, మీ ఎలిజిబిలిటీ ని కరెక్ట్ గా చెక్ చేసుకుని లోన్ అప్లై చేయడం, ఇలాంటి డిజిటల్ లోన్ యాప్స్ లో ట్రాన్స్‌పరెన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మీకు బెస్ట్ ఆప్షన్ అనిపిస్తేనే ఉపయోగించండి.
IRCTC : రైలు ప్రయాణం భారతదేశంలో చాలా మంది ఎంచుకునే ఒక రవాణా మార్గం. ఎందుకంటే ఇది చౌకగా ఉండటం,…
డబ్బులు ఏమైనా చెట్లకి కాస్తున్నాయా? అంటే డబ్బులు చెట్లకి కాయవు కానీ, స్టాక్ మార్కెట్లో తెలివిగా ఇన్వెస్ట్ చేస్తే మంచి…
Own Vs Rent : మన జీవితంలో ఇల్లు అనేది ఒక ముఖ్యమైన అవసరం మాత్రమే కాదు, మన భవిష్యత్…
F&O: Tradiఇండియన్ స్టాక్ మార్కెట్‌లో దూకుడు కొనసాగుతోంది. ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ఇటీవల జరుగుతున్న మార్పులు, పరిణామాలు, ఇన్వెస్టర్ల దృష్టిని…
Credit Card: ఇటీవలి కాలంలో క్రెడిట్ కార్డులు మన జీవనశైలిలో ఒక ప్రధాన భాగంగా మారాయి. ప్రతి ఒక్కరి దగ్గర…
IPO: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల కోసం ముఖ్యమైన వార్త. మరో పెద్ద ఐపీఓ మార్కెట్లోకి వస్తోంది. భారతదేశంలోని ప్రముఖ నవరత్న…