Kotak Kanya Scholarship 2024: ఇంటర్ పాసైన వారికి సంవత్సరానికి ₹1.5 లక్షల స్కాలర్‌షిప్! ఎలా అప్లై చేసుకోవాలి?

Kotak Kanya Scholarship: భారతదేశంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు మద్దతు ఇవ్వడం కోసం కోటక్ మహీంద్రా గ్రూప్ నూతనంగా ప్రవేశపెట్టిన కోటక్ కన్యా స్కాలర్‌షిప్(Kotak Kanya Scholarship) అనేది ఒక అద్భుతమైన పథకం. ఈ స్కాలర్‌షిప్ ప్రధానంగా ఆర్థిక పరంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన అమ్మాయిలకు ప్రోత్సాహం ఇస్తుంది.

మన దేశంలో ఉన్న ఉన్న ప్రతిభావంతులైన పేద బాలికలకు ఉన్నత విద్య అందిచడం కోసం ఈ “కోటక్ కన్య స్కాలర్‌షిప్”​ను అందిస్తోంది. ఈ స్కాలర్‌షిప్ కింద, ప్రతి బాలికకు ప్రతి ఏడాదికి రూ.1.5 లక్షల ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఈ సాయం విద్యార్థిని తన కోర్సు పూర్తయ్యే వరకు అందిస్తారు. బాలికల ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి ఈ స్కాలర్‌షిప్‌ను ప్రవేశపెట్టినట్లు సంస్థ తెలిపింది. ఈ మొత్తాన్ని బాలికలు ల్యాప్‌టాప్, హాస్టల్, ట్యూషన్ లేదా ఇతర ఖర్చుల కోసం ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. అయితే, ఈ స్కాలర్‌షిప్‌ను కేవలం ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థినులకు మాత్రమే అందజేస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

స్కాలర్‌షిప్ కు ఎవరు అర్హులు (Eligibility Criteria)

  • దేశవ్యాప్తంగా ఉన్న బాలికలు అందరూ అర్హులుగా పరిగణించబడతారు.
  • 12వ తరగతి (ఇంటర్మీడియట్)లో కనీసం 75% మార్కులు సాధించి ఉండాలి.
  • బాలిక కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షల రూపాయల కన్నా తక్కువగా ఉండాలి.
  • కోటక్ మహీంద్రా గ్రూప్, కోటక్ ఎడ్యూకేషన్ ఫౌండేషన్, మరియు బడ్డీ ఫర్ స్టడీ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల పిల్లలు ఈ స్కాలర్షిప్‌కు అర్హులు కారు.
  • సెప్టెంబర్ 30లోపు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్, మెడిసిన్, ఆర్కిటెక్చర్, మరియు ఇతర వృత్తిపరమైన కోర్సుల్లో ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులను
  • అభ్యసిస్తున్న మొదటి ఏడాది మహిళా విద్యార్థులు కూడా ఈ స్కాలర్‌షిప్ దరఖాస్తుకు అర్హులు.
  • అన్ని కులాలు, మతాలకు చెందిన అమ్మాయిలు ఈ స్కాలర్‌షిప్ కు అర్హులు.

అవసరమైన పత్రాలు (Required Documents)

  • 12వ తరగతి మార్క్ షీట్.
  • పాస్పోర్ట్ సైజ్ ఫోటో.
  • కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం (స్థానిక తహసీల్దార్ నుండి పొందిన ఆదాయ ధృవీకరణ పత్రం).
  • క్యాస్ట్ సర్టిఫికేట్: కుల ధృవీకరణ పత్రం (అవసరం ఉన్నవారికి).
  • ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్.
  • బ్యాంక్ పాస్​బుక్​
  • విద్యార్థిని చదువుతున్న కోర్సు ఫీజు వివరాలు
  • కాలేజీ సీట్ అలాట్​మెంట్​ లెటర్​
  • ప్రవేశ పరీక్ష స్కోర్​ కార్డ్​
  • వైకల్యం ఉంటే సర్టిఫికెట్​
  • డెత్​ సర్టిఫికెట్​(తల్లి లేదా తండ్రి మరణిస్తే)

దరఖాస్తు ప్రక్రియ (Application Process)

  • కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అధికారిక వెబ్‌సైట్ “https://www.buddy4study.com/page/kotak-kanya-scholarship#scholarships”
  • లోకి వెళ్లి Apply Now పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత Buddy4Study పేజ్​లో మీ వివరాలు ఎంటర్ చేసి లాగిన్​ అవ్వాలి.
  • తరువాత విద్యార్థి వ్యక్తిగత వివరాలు, కుటుంబ ఆదాయ వివరాలు, మరియు విద్యార్హత వివరాలు నమోదు చేయాలి.
  • అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేసి కింద ఉన్న నియమనిబంధనలు(టర్మ్స్ అండ్ కండీషన్స్​) అంగీకరించాలి.
  • వెంటనే ప్రివ్యూపై క్లిక్ చేసి వివరాలన్ని సరిగ్గా ఉన్నాయే లేదో చెక్ చేసుకుని సబ్మిట్​ చేయాలి.
  • దరఖాస్తు చివరి తేదీ కంటే ముందుగా ఫారం సమర్పించాలి.

స్కాలర్‌షిప్ యొక్క ప్రయోజనాలు (Benefits of the Scholarship)

  1. ఫీజు రీయింబర్స్మెంట్: విద్యార్థులు చదువుకుంటున్న కాలేజీ లేదా విశ్వవిద్యాలయం ఫీజు మొత్తం లేదా భాగం కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ద్వారా కవర్ చేయబడుతుంది.
  2. ఆర్థిక సాయంతో: పుస్తకాలు, వసతి, ఇతర అవసరాల కోసం కూడా ఆర్థిక సహాయం లభిస్తుంది.
  3. క్యారియర్ గైడెన్స్: విద్యార్థులకు చదువు, కెరీర్ మరియు పర్సనల్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేకమైన గైడెన్స్ అందించబడుతుంది.
  4. మొత్తం స్కాలర్‌షిప్: మొత్తం స్కాలర్‌షిప్ మొత్తం కోర్సు కాలం పాటు అందుబాటులో ఉంటుంది.

కోటక్ కన్యా స్కాలర్‌షిప్ 2024 అనేది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన అమ్మాయిలకు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఒక ప్రాథమిక దారి. ఈ పథకం వారు చదువులో రాణించడానికి మరియు తమ కెరీర్‌ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

ముఖ్యంగా, ఈ పథకం ద్వారా విద్యార్థులకు అందించబడుతున్న ఆర్థిక సహాయం వలన, వారు వారి కలల కోర్సులను పూర్తి చేయడానికి అవసరమైన అన్ని వసతులు పొందవచ్చు.

గమనిక: ఈ స్కాలర్‌షిప్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం మరియు దరఖాస్తు చేయడం కోసం కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అధికారిక వెబ్‌సైట్లో చూడండి.

WhatsApp Channel Follow Now