Poor Habits: మిమ్మల్ని పేదవారిగా చేసే 9 అలవాట్లు ఇవే..

Poor Habits: కొత్త సంవత్సరం రాగానే చాలా మంది జిమ్ లో జాయిన్ అవుతారు వాకింగ్ స్టార్ట్ చేస్తారు మందు మానేస్తారు ఇలా చాలా రకాల కొత్త పనులు చేస్తుంటారు నాలుగైదు రోజుల తర్వాత చూస్తే సగం మంది వాటిని ఫాలో అవ్వరు ఇంకో నాలుగైదు రోజుల తర్వాత చూస్తే మొత్తానికి వదిలేస్తారు మళ్ళీ గత సంవత్సరం మాదిరిగానే చేస్తూ ఉంటారు. 21 రోజులు రెగ్యులర్ గా మనం ఒక పని చేస్తే అది ఒక హ్యాబిట్ గా మారుతుంది అని ఒక సూత్రం ఉంది. కానీ మనకు మంచి అలవాట్లు దక్కడం కంటే చెడు అలవాట్లు త్వరగా పట్టేస్తాయి! ఒక్కసారి మనకు ఒక పని అలవాటు అయితే చాలు మనం కాన్షియస్ లో ఉన్నా లేకున్నా ఆ పని చేసుకోవాలి తీసుకుంటూ పోతాం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సిగరెట్ తాగడం ఒక్కసారి అది అలవాటు అయితే కొంచెం స్ట్రెస్ అనిపిస్తే చాలు వెంటనే సిగరెట్ లాగించాల్సిందే కానీ రాబోయే రోజుల్లో ఈ అలవాటు వల్ల మీరు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చు అంటే అలవాట్ల వల్ల మీ జీవితంలో మంచి మార్పులు లేదా చెడు మార్పులు కూడా రావచ్చు.

అలాగే ఒక మనిషి రిచ్ కావడానికైనా పూర్ కావడానికైనా వారి అలవాట్లే కారణం. మీకు ఉన్న ఫైనాన్షియల్ హ్యాబిట్స్ మీదే మీ ఫైనాన్షియల్ లైఫ్ ఆధారపడి ఉంటుంది ఈ రోజుల్లో చాలా మంది పాటిస్తున్న కొన్ని అలవాట్లు వారిని పేదవారిగా చేస్తున్నాయి అవేంటో మీరు తెలుసుకుంటే వాటిని మీరు చేయకుండా ఉంటారు.

1. ఇతరుల కోసం బతకడం

ఈ రోజుల్లో చాలా మంది తమ కోసం కాదు ఎక్కువగా ఇతరుల కోసం బ్రతుకుతారు తాము రిచ్ అని చూపించుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు లేనిపోని ఖర్చులు చేస్తారు పక్కింటి వాడికి కారు ఉందని డబ్బు లేకపోయినా కారు కొంటారు తన కొలీగ్ ఐఫోన్ వాడుతున్నాడని వీరు కూడా ఐఫోన్ కొంటారు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కొంత డబ్బు సేవ్ చేస్తే వీరు వారిని బ్లాక్ మెయిల్ చేసి చేసి ఆ డబ్బుతో ఐఫోన్ కొంటారు మనం ఎన్నో వార్తలు ఇలాంటివి చూసి ఉన్నాం బంగారం కొన్న కారు కొన్న అపార్ట్మెంట్ కొన్న చివరికి చెప్పులు కొన్న కూడా ఇతరులకు చూపించుకోవడానికి మాత్రమే కొంటారు అంతేగాని తమ కోసం కొనరు ఇక వాట్సాప్ బ్యాచ్ గురించి చెప్పనవసరం లేదు whatsapp లో స్టేటస్ పెట్టుకోవడం కోసమే సినిమాలకు వెళ్తారు షికార్లకు వెళ్తారు హోటల్స్ కి వెళ్తారు ఇంట్లో బిర్యానీ చేసుకొని తిన్నా కూడా దానికి whatsapp లో స్టేటస్ పెట్టే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ధనవంతులు సైలెంట్ గా రహస్యంగా సృష్టించబడతారు

rich-businessman-cartoon-scene_1284-23159

2. ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ

మీరు ఈఎంఐ లు ఎక్కువగా కడుతున్నారా లేకపోతే ఎస్ఐ పిలు ఎక్కువగా కడుతున్నారా ఇక్కడే తెలిసిపోతుంది మీరు పేదవారా లేకపోతే ధనవంతురా అని ఇక్కడ రెండు రకాల అలవాట్లు గల వ్యక్తులు ఉంటారు ఒకరు తాము సంపాదించిన దాంట్లో కొంత సేవ్ చేసి మిగిలింది ఖర్చు పెట్టేవారు ఈ ఇంకొకరు తాము సంపాదించిన దాంట్లో తమ ఖర్చులను తీసేసి సేవ్ చేద్దాం అనుకునేవారు కానీ చేయలేరు ఈ అలవాటే వీరి కొంప ముంచేది మీ ఇన్కమ్ మీ ఎక్స్పెండిచర్ ని ట్రాక్ చేయకపోతే మీరు ఎప్పుడూ రిచ్ అవ్వలేరు మీరు ఖర్చు చేసే ప్రతి ఒక్క రూపాయి మీకు తెలిసి ఉండాలి మైండ్ ఫుల్ గా స్ప్రెడ్ చేస్తే ఏది అవసరమైన ఖర్చు ఏది అనవసరమైన ఖర్చు అనేది తెలుస్తుంది.

top-view-budget-planning-note-with-pens-gray-surface-job-copybook-school-student-business-work-college-money-budget_179666-19724

3. మీకోసం మీరు ప్లాన్ చేయకపోవడం

మీరు ఏదైనా ఒక కంపెనీలో లేదా ఆఫీస్ లో పని చేస్తున్నారు అనుకోండి మీరు మీ బాస్ కి రిపోర్టింగ్ చేసేటప్పుడు ఎలా చేస్తారు కొంతమంది పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ తయారు చేస్తారు కొంతమంది ఎక్సెల్ షీట్ తయారు చేస్తారు బాస్ ను సంతోషపరచాలని రకరకాల రిపోర్టులు డీటెయిల్డ్ గా తయారు చేసి చూపిస్తూ ఉంటారు కానీ ఎప్పుడైనా మీ కోసం మీరు ఏదైనా ఎక్సెల్ షీట్ తయారు చేసుకున్నారా లేదంటే పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ తయారు చేసుకున్నారా లేదు కదా మనం చేయము ఎందుకంటే ఎవ్వరూ అడగరు కదా అని ఒక కంపెనీకి కొన్ని ఫైనాన్షియల్ గోల్స్ ఉంటాయి కాబట్టి ఆ కంపెనీకి ఒక ఫైనాన్షియల్ ప్లాన్ ఉంటుంది మరి మీకు కూడా కొన్ని ఫైనాన్షియల్ గోల్స్ ఉంటాయి కదా మరి మీకేది ఆ ప్లాన్ ఎవరి కోసమో రిపోర్టులు ఎక్సెల్ షీట్స్ తయారు చేస్తుంటారు. మీ కోసం మీరు ఒక్క రిపోర్ట్ తయారు చేసుకోలేరా ఎవరికో చూపించాల్సి వస్తే తప్ప మీరు ఒక్క రిపోర్ట్ తయారు చేసుకోలేరా అది కూడా మీ కోసం మీరు ఏ ఫైనాన్షియల్ గోల్ పెట్టుకున్న దాన్ని రీచ్ కావాలంటే తప్పకుండా బడ్జెట్ ప్లాన్ చేసుకోవాల్సిందే లేదంటే మీ గోల్స్ ని ఎప్పటికీ రీచ్ కాలేరు.

మీరు ఒక కార్ కొనాలనుకున్న లేదంటే ఇల్లు కొనాలనుకున్నా అనుకున్న దానికి దాని డౌన్ పేమెంట్ కి అయ్యే డబ్బును మీరు ముందుగానే రెడీ చేసుకోవాలి, దీని కోసం మీరు ప్రతి నెల మీకు వచ్చిన శాలరీలో కొంత డబ్బును సేవ్ చేసుకోవాలి దేనికి ఎంత డబ్బు కేటాయించాలి అనేది మీరు బడ్జెట్ ప్లాన్ లోనే తయారు చేసుకోవాలి మన బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉంటాయి అంటే మంచి పుస్తకానికి పుస్తకానికి ₹350 పెట్టాలంటే మనసు ఒప్పదు, కానీ మందు తాగడానికి ₹700 సులువుగా ఖర్చు పెడతాం లేదా ఒక సినిమా కి వెళ్ళడానికి ₹1000 ఖర్చు పెడతాం. రాక రూపాయి పోక అనేది రాష్ట్రానికి లేదా దేశానికి కాదు మీకే ఎక్కువగా అవసరం. మీ ఖర్చులను క్రమబద్ధీకరించి, మీ లక్ష్యాలను సాధించడానికి ఖర్చులను ప్రాధాన్యత క్రమంలో ఉంచండి.

4. మీకంటే మీరు వాడే వస్తువులకే ఎక్కువ విలువ ఇవ్వడం

మీరు వాడే బైక్ కు లేదా కారుకి ఇన్సూరెన్స్ ఉంటుంది కానీ మీకు ఇన్సూరెన్స్ ఉండదు ఎందుకంటే మీకంటే బండి విలువ ఎక్కువ కాబట్టి అంతేనా మన దేశంలో 100 కు 30 మందికి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు వీరికి జస్ట్ ఒక్క మెడికల్ బిజాలు మిడిల్ క్లాస్ నుండి పేదవారుగా మారడానికి, అలాగే మన దేశంలో 100 కు 25 మందికి లైఫ్ ఇన్సూరెన్స్ లేదు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడటం లాంటివి ఎన్నో చూస్తున్నాం. ఈ రోజుల్లో టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత తక్కువలో వస్తుందంటే ₹2 కోట్ల రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ కోసం జస్ట్ నెలకు ₹600 నుండి ₹700 కడితే చాలు అంటే రోజుకు 20 నుండి ₹25 అంతే, ఈ రోజుల్లో ఒక్క టీ తాగినా కూడా 20 లేదా 25 అవుతాయి. మీకు ఏ కంపెనీ పాలసీ ఎటువంటి పాలసీ తీసుకోవాలో తెలియదు అనుకోండి మీ ఇంటి వద్దకే వచ్చి మీకు ఇన్సూరెన్స్ ఇచ్చేవారు కూడా ఉన్నారు

money management for freelancers
Money Management Tips: ఫ్రీలాన్సర్ మనీ మేనేజ్‌మెంట్ కోసం 8 ఉపయోగకరమైన చిట్కాలు

ఏంటంటే 24/7 365 డేస్ క్లెయిమ్ అసిస్టెన్స్ ఉంటుంది అలాగే మీకు టాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది మీరు సెక్షన్ 80c ప్రకారం సంవత్సరానికి 150 50000 వరకు టాక్స్ సేవ్ చేసుకోవచ్చు మీ ఇన్కమ్ లెవెల్స్ పెరిగినప్పుడు మీకున్న ఇన్సూరెన్స్ కవరేజ్ ను 20 కోట్ల రూపాయల వరకు పెంచుకోవచ్చు కూడా ఆన్లైన్ లో పాలసీ తీసుకుంటున్నారు కాబట్టి మీకు ఆన్లైన్ డిస్కౌంట్ 10% వరకు లభిస్తుంది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మీకు మానసిక ప్రశాంతత కలగడంతో పాటు అది మీ తర్వాత మీ కుటుంబాన్ని రక్షిస్తుంది అందుకే ఆలస్యం చేయకుండా ఈరోజే టర్మ్ ప్లాన్ తీసుకోండి మీ ఫ్యామిలీకి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకోండి.

celebrating-happy-young-people-design_24908-57384

5. లైఫ్ స్టైల్ అప్గ్రేడేషన్

ఈసారి జీతం పెరగగానే పెద్ద టీవీ తీసుకుందాం ఏసీ తీసుకుందాం కారు తీసుకుందాం అది కొనాలి ఇది కొనాలి అని ముందుగానే చాలా ప్లాన్ చేసుకుంటారు కానీ ఎప్పుడైనా ఆ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలి ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచించారా లేదు కదా ఇన్కమ్ పెరిగిన ప్రతిసారి లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేయడం గురించి మాత్రమే ఆలోచిస్తారు. అవి మీకు నిజంగా అవసరమా? ఇన్కమ్ పెరుగుతుంది దాంతో పాటు ఎక్స్పెండిచర్ కూడా పెరుగుతుంది లక్ష రూపాయల జీతం వచ్చినప్పుడు లక్షకు లక్ష ఖర్చు పెట్టేవారు ఉన్నారు, లక్ష రూపాయల జీతం వచ్చేవారు 30000 మాత్రమే ఖర్చు బట్టి 70000 ఇన్వెస్ట్ చేసేవారు కూడా ఉన్నారు.

మీరు సంపాదించిన దాంట్లో ఎంత శాతం మిగులుస్తున్నారు అన్న దాన్ని బట్టే మీరు పేదవారా ధనవంతులా అని కూడా నిర్ణయించవచ్చు 100 కి 100 ఖర్చు పెడితే మీరు పేదవారి కిందే లెక్క ఇంతకు ముందు చెప్పినట్టు 100 కి 30 ఖర్చు పెడితే 70 మిగిలి ఉంటే మీరు కాబోయే ధనవంతులు అని చెప్పవచ్చు. మార్వాడీలు ₹100 సంపాదిస్తే ₹10 చూపించుకుంటారు, కానీ మనం ₹10 సంపాదించి ₹100 రూపాయలు చూపించుకుంటాం. ఇన్వెస్ట్ లేదా సేవింగ్స్ లాంటివి చేయకపోతే రానున్న రోజుల్లో ఏంటో నష్టపోతారు అన్న సంగతి గ్రహించాలి.

Tax Planig

6. టాక్స్(Tax) ల గురించి తెలుసుకోండి

ముకేష్ అంబాని 4% టాక్స్ కడితే మనం 30% టాక్స్ కడుతున్నాం అంటే ముకేష్ అంబాని దేశాన్ని దోచుకుంటున్నాడని జీవితమంతా గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్ అయిన కొంతమంది కొన్ని సందర్భాల్లో చెప్తే అవును ఇది నిజమే కదా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ ఆ అవకాశం మీకు కూడా ఉంది కదా అని వారు చెప్పరు మీరు కూడా వారిలాగే కావచ్చు కదా అని సలహా ఇవ్వరు ఈ ప్రపంచంలో టాక్స్ ప్లానింగ్ తెలిసిన వారు మాత్రమే ధనవంతులు అవుతారు మీరు మీ ఆఫీస్ లో 100 ప్రాబ్లం సాల్వ్ చేస్తారు కానీ మీకున్న టాక్స్ ప్రాబ్లం మాత్రం సాల్వ్ చేసుకోరు.

సంవత్సరంలో మీరు కేవలం ఒక్క గంట కేటాయిస్తే చాలు మీరు ఏ ఏ టాక్స్ లు ఎంత కట్టాలి ఎక్కడ ఎంత సేవ్ చేసుకోవచ్చు అన్న విషయం మీకు కరెక్ట్ గా తెలియడానికి. ఏ దేశంలోనైనా టాక్స్ ఉంటాయి వాటికి ఎన్నో టాక్స్ ఎక్సెంప్షన్స్ కూడా ఉంటాయి వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయం తెలియాలంటే టాక్స్ రూల్ గురించి మనకు మొత్తం తెలియాలి లేకపోతే ఎక్కువ టాక్స్ లు పే చేయాల్సి వస్తుంది ఒక పుస్తకంలో ఎవరో రాసినట్టు గుర్తు, ప్రతి ఒక్క దేశంలో టాక్స్ లు ఉంటాయి తెలివైన వారు అందులో నుంచి బయట పడతారు మిగతా వారు అవి కట్టుకుంటూ పోతూ ఉంటారు.

అయితే గవర్నమెంట్ కి కావాల్సింది కూడా అదే, తెలివైన వారు టాక్స్ నుంచి బయట పడతారు అంటే వారు ఇంకా ఏదో వెల్త్ క్రియేషన్ చేస్తున్నారు అన్నమాట, దేశానికి కావాల్సింది కూడా అదే. ఎకనామిక్స్ అందరికీ అర్థం కాదు ఈ ఆర్టికల్ చదివిన తర్వాత ఒక్కసారి మీరు ఏ ఏ టాక్స్ లు కడుతున్నారు వాటిని ఎలా తగ్గించుకోవచ్చు అని మీకు తెలిసిన కొంతమందిని అడగండి మీకు ఖచ్చితంగా చాలా మార్గాలు దొరుకుతాయి.

7. అప్పు ముప్పు

మన పెద్దవారు అప్పు అంటేనే భయపడేవారు కానీ నేటి జనరేషన్ నీళ్లు తాగినంత ఈజీగా లోన్స్ తీసుకుంటున్నారు. ఏ చిన్న అవసరం వచ్చినా చాలు ఏదో ఒక లోన్ యాప్ డౌన్లోడ్ చేయడం లోన్స్ తీసుకోవడం దాన్ని పే చేయడానికి మరో లోన్ తీసుకోవడం చేస్తున్నారు అలాగే క్రెడిట్ కార్డు కూడా తీసుకొని లిమిట్ మొత్తం వాడుకొని బిల్ పే చేయడానికి మరో క్రెడిట్ కార్డు వాడకం చేస్తున్నారు. దీనినే క్రెడిట్ ట్రాప్ అని అంటారు దీనివల్ల వల్ల ఎక్కువ డబ్బులు ఇంట్రెస్ట్ పే చేయడానికి అయిపోతున్నాయి అప్పు ఇస్తున్నారు అంటే ఏదో అవార్డు ఇస్తున్నారు అన్నంతగా సంబర పడిపోతున్నారు.

డిజిటల్ యుగంలో స్కాముల గురించి తెలియజేసే వ్యాసం. ఫిషింగ్, ఫేక్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా స్కాములు, మరియు స్టాక్ మార్కెట్ మోసాల వివరాలు. స్కామ్‌లను గుర్తించి, వాటికి బలవకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు. డిజిటల్ భద్రతకు సంబంధించి అవసరమైన అవగాహనను కల్పించే సూచనలతో పాటు సైబర్ నేరగాళ్ల మోసపద్ధతులపై విశ్లేషణ.
Types Of Online Fraud: వామ్మో ఆన్​లైన్ మోసాలు ఇన్ని రకాలుగా జరుగుతాయా! ఇవిగో జాగత్తలు…

ఈ రోజుల్లో ఎక్కడ లోన్ దొరుకుతుంది ఎక్కడ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది కొత్త క్రెడిట్ కార్డు ఏం వచ్చింది ఇలాంటివి కాదు మీరు ఫోకస్ చేయాల్సింది, మీ ఇన్కమ్ పెంచుకోవడం పై మాత్రమే మీరు ఫోకస్ చేయాలి. చెడ్డ అప్పుల్ని వీలైనంతగా తగ్గించుకోండి మంచి అప్పుల్ని మాత్రమే చేయండి అప్పు తీసుకున్నారు అంటే దాంతో సంపద సృష్టి జరిగే అవకాశం ఉంటేనే తీసుకోవాలి. అప్పుడే అప్పు అనే ఊబిలో పడకుండా ఉంటారు, ముప్పు నుండి తప్పించుకుంటారు.

8. కొంపలు ముంచే సలహాలు పాటించకండి

కారు డ్రైవర్‌ను కంప్యూటర్ గురించి అడగడం ఎలా అనాలో, అలాగే మీకు డబ్బులు ఎక్కడ పెట్టాలో ఎవరికైనా అడగడం కూడా ఆలోచించుకోవాలి. డబ్బులు పెట్టుబడి చేయడం తప్పు కాదు, కానీ ఎలాంటి అవగాహన లేకుండా పెట్టుబడి చేయడం పెద్ద తప్పు. కొందరు ట్రేడింగ్‌లో పెట్టుబడి చేస్తారు అని అనుకుంటే, మరికొందరు కోట్లు సంపాదిస్తామనే ఆశతో నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో చేరుతారు. ఒక ఫ్రెండ్ సలహాతో ఎలాంటి పరిశీలన లేకుండా ఒక కంపెనీలో డబ్బు పెట్టి, కొంతకాలం తర్వాత ఆ కంపెనీ మూతపడటంతో డబ్బు మొత్తం కోల్పోయి బాధపడతారు.

ఈ రోజుల్లో ప్రతి అంశానికి ప్రత్యేక నిపుణులు అందుబాటులో ఉన్నారు. మీకు ఏ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలో, దాన్ని ఎలా ఉపయోగించాలో కూడా సలహా ఇచ్చే క్రెడిట్ కార్డ్ ఎక్స్పర్ట్లు ఉన్నారు. మీ పెట్టుబడులు సురక్షితంగా ఉండాలని, భవిష్యత్తు కోసం మంచి నిర్ణయాలు తీసుకోవాలని మీరు ఎప్పుడూ నిపుణుల సలహా తీసుకోవడం చాలా అవసరం.

Skil Developing

9. అప్డేట్ అవ్వండి

మీరు ఒక కంపెనీలో పనిచేస్తుంటే, మీ సబ్జెక్టులో మంచి పరిజ్ఞానం ఉన్నా, కమ్యూనికేషన్ స్కిల్స్ లేదా లీడర్షిప్ స్కిల్స్ లేకపోతే, ఆ స్కిల్స్ ఉన్న వ్యక్తి మీ స్థానాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. నేటి ప్రపంచంలో ఉద్యోగాలన్నీ స్కిల్స్ ఆధారంగానే జరుగుతున్నాయి. అవసరమైన స్కిల్స్ లేని వ్యక్తిని స్థానంలో ఉంచడం కన్నా, కొత్త టాలెంట్ తీసుకురావడమే సంస్థలు ప్రాధాన్యతగా చూస్తున్నాయి.

అందుకే, మీకు ఉన్న పరిజ్ఞానంతో పాటు కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, మీను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకోవడం అత్యవసరం. టెక్నాలజీ, మార్కెట్ ట్రెండ్‌లు మారుతున్న వేగానికి అనుగుణంగా మీను అప్డేట్ చేసుకోవాలి. లేదంటే, పోటీ ప్రపంచంలో వెనుకబడిపోవడం ఖాయం. మీ భవిష్యత్తు సురక్షితం కావాలంటే, నేర్చుకోవడం ఆపకండి, ఎల్లప్పుడూ మీ స్కిల్స్ ను పెంచుకుంటూ ఉండండి.

ముఖ్యమైన సందేశం

ఇప్పటిదాకా మిమ్మల్ని పేదవారిగా చేసే కొన్ని అలవాట్ల గురించి తెలుసుకున్నారు. ఇలాంటి అలవాట్లే కాదు మీరు మీ మైండ్ సెట్ కూడా మార్చుకోగలిగితే మీరు పూర్ ఇంకా మిడిల్ క్లాస్ నుండి రిచ్ గా మారుతారు. మంచి అలవాట్లు చిన్నగా మొదలవుతాయి, కానీ పెద్ద విజయాలను తీసుకువస్తాయి.” ఈరోజు నుంచే మీ ఆర్థిక అలవాట్లపై ఆలోచించండి. చిన్న మార్పులు మీ జీవితంలో పెద్ద ప్రభావాలు చూపుతాయి. మీ డబ్బు మీ భవిష్యత్తును నిర్మించాలి. దాన్ని వృధా చేయకండి.

WhatsApp Channel Follow Now