Credit Card Money Transfer
ఈ రోజుల్లో క్రెడిట్ కార్డు ఉపయోగం అధికంగా పెరిగింది. పేమెంట్లు చేయడం, ఆన్‌లైన్ షాపింగ్ చేయడం మాత్రమే కాకుండా, కొన్నిసార్లు మనం క్రెడిట్ కార్డులో ఉన్న క్రెడిట్‌ను బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేయాల్సిన అవసరం వస్తుంది. అయితే, ఇది ఎలా చేయాలో చాలా మందికి స్పష్టంగా తెలియదు.
డబ్బు అత్యవసర పరిస్థితుల్లో మనం తరచుగా వ్యక్తిగత రుణాలు తీసుకోవడం లేదా తెలిసినవారి దగ్గర కొంత మొత్తం అప్పుగా అడగడం చేస్తుంటాం. అయితే, అలాంటి సందర్భాల్లో క్రెడిట్ కార్డ్‌లో అందుబాటులో ఉన్న సొమ్మును ఉపయోగించుకోవడం ఒక స్మార్ట్ ఆప్షన్ గా భావించవచ్చు. ఇది తక్షణ అవసరాలను తీర్చడమే కాకుండా, సరైన ప్రణాళికతో తిరిగి చెల్లించే అవకాశం కూడా ఇస్తుంది. కానీ, దీనికి సంబంధించిన ప్రయోజనాలు, మైనస్ పాయింట్లు మరియు శ్రద్ధ వహించాల్సిన విషయాలను తెలుసుకోవడం ఎంతో కీలకం.
మొదట మీరు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, క్రెడిట్ కార్డు యొక్క ప్రధాన లక్ష్యం నేరుగా చెల్లింపులను చేయడం. పదేపదే డబ్బును బదిలీ చేయడం ద్వారా, మీరు క్రెడిట్ కార్డు యొక్క సద్వినియోగం చేయలేరు. దానిని షాపింగ్ కోసం ఉపయోగించలేరు, రివార్డ్ పాయింట్లను కూడా సంపాదించలేరు. మరొక విషయం ఏమిటంటే, మీరు క్రెడిట్ కార్డు పరిమితిని అధిగమిస్తే, ఆదాయపు పన్ను శాఖ మీ లావాదేవీలను పర్యవేక్షించే అవకాశం ఉంది. క్రెడిట్ కార్డులపై సంవత్సరానికి రూ. 2 లక్షలకు పైగా ఖర్చు చేసే వ్యక్తుల వివరాలను బ్యాంకులు ఆదాయపు పన్ను శాఖకు పంపిస్తాయి. తరచుగా డబ్బు బదిలీ చేయడం పన్ను అధికారుల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉందని గుర్తుంచుకోండి.
ఈ ఆర్టికల్‌లో, క్రెడిట్ కార్డు నుండి బ్యాంక్ ఖాతాకు డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఉన్న మార్గాలు, ఫీజులు, మరియు జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం.
క్రెడిట్ కార్డు నుండి డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయడం ఎందుకు అవసరం?
- అత్యవసర అవసరాలు (Emergency Needs)
- బ్యాంక్ బ్యాలెన్స్ తక్కువగా ఉన్నప్పుడు
- అకస్మాత్తుగా డబ్బు అవసరమైనప్పుడు
- బిజినెస్ అవసరాలకు
- ఇతర వ్యక్తులకు పంపించడానికి

నెట్ బ్యాంకింగ్ ద్వారా డైరెక్ట్ ట్రాన్స్‌ఫర్ (Balance Transfer Facility)
చాలా బ్యాంకులు వారి ఆన్‌లైన్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఈ ఎంపికను అందిస్తాయి. కాస్త ఎక్కువ ఛార్జీలు ఉండొచ్చు, కానీ ఈ పద్ధతి ద్వారా మీ ఖాతాకు తక్షణమే డబ్బు చేరుతుంది.
- మీ నెట్ బ్యాంకింగ్ ఖాతాలో లాగిన్ అవ్వండి.
- క్రెడిట్ కార్డు విభాగానికి వెళ్లండి.
- ‘ఫండ్స్ ట్రాన్స్‌ఫర్’ లేదా ‘క్యాష్ అడ్వాన్స్’ ఎంపికను ఎంచుకోండి.
- కావలసిన మొత్తం మరియు మీ బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేయండి.
- లావాదేవీని ధృవీకరించండి.
ఫీజులు & వడ్డీ రేట్లు:
- సాధారణంగా 1% – 5% వరకు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది.
- 12% – 24% మధ్య వడ్డీ రేట్లు వర్తించవచ్చు.
పేమెంట్ యాప్స్ ద్వారా
క్రెడిట్ కార్డు నుండి బ్యాంకు ఖాతాకు డబ్బు బదిలీ చేయడానికి ఉపయోగించదగిన పేమెంట్ యాప్స్ కొన్ని ఉన్నాయి
- పేమెంట్ యాప్స్ అయిన PhonePe, Paytm, Amazon Pay, Google Pay, Cred APP, Instamojo ద్వారా మీ క్రెడిట్ కార్డును లింక్ చేసి, మీ బ్యాంక్ ఖాతాకు నేరుగా డబ్బు పంపవచ్చు.
- అయితే, ఈ పేమెంట్ యాప్స్ లావాదేవీ ఛార్జీలు వసూలు చేస్తాయి.
- పేమెంట్ యాప్‌ల ద్వారా మీరు నేరుగా క్రెడిట్ కార్డ్ నుండి బ్యాంక్ ఖాతాకు డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయడం కొంచెం సులభమైన విధానం.
- ఈ బదిలీ కోసం విశ్వసనీయమైన ప్లాట్‌ఫారమ్‌లను మాత్రమే ఎంచుకోవాలి.
థర్డ్ పార్టీ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసే విధానం:
- మీకు నచ్చిన యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి.
- క్రెడిట్ కార్డు వివరాలు నమోదు చేయండి.
- Wallet లోకి డబ్బు జమ చేసుకోండి.
- Wallet నుండి బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేయండి.
థర్డ్ పార్టీ అప్లికేషన్ల వాడకంలో జాగ్రత్తలు:
- ఎలాంటి హిడెన్ చార్జీలు ఉన్నాయో ముందుగా తెలుసుకోండి.
- అధిక ఫీజులు ఉన్నప్పుడైతే బ్యాంక్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేయడం మంచిది.
- ట్రస్టెడ్ అప్లికేషన్లు మాత్రమే వాడండి.

ఏటీఎం ద్వారా కాష్ అడ్వాన్స్ ఫెసిలిటీ (Cash Advance)
- కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డ్ యూజర్లకు కాష్ అడ్వాన్స్ సదుపాయాన్ని ఇస్తాయి. ఈ కాష్ అడ్వాన్స్ ద్వారా మీరు మీ క్రెడిట్ కార్డు నుండి డబ్బును ఏటీఎం(ATM) ద్వారా తీసుకోవచ్చు లేదా మీ బ్యాంక్ ఖాతాకు జమ చేసుకోవచ్చు.
- కాష్ అడ్వాన్స్ కోసం అధిక వడ్డీ రేట్లు ఉండొచ్చు మరియు కనీసంగా కొన్ని ఛార్జీలు కూడా ఉండొచ్చు.
- ప్రస్తుత రోజుల్లో కొన్ని కంపెనీ లు తమ కస్టమర్స్ కోసం ప్రీమియం కార్డ్స్ ను అందుబాటులోకి తెచ్చాయి, ఈ క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఎటువంటి చార్జీలు లేకుండా ఏటీఎం(ATM) నుండి డబ్బు తీసుకునే సదుపాయం అందిస్తున్నాయి. అందుచేత మీ కార్డు ఫీచర్స్ గురించి తెలుసుకోండి.
ఫీజులు:
- 2% – 5% క్యాష్ అడ్వాన్స్ ఫీజు.
- 24% – 48% వరకు అధిక వడ్డీ రేటు.
బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ద్వారా
బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేయడం ద్వారా మీ క్రెడిట్ కార్డు బిల్లులు సులభంగా చెల్లించవచ్చు మరియు మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచవచ్చు.
- క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ అనేది మీరు ఒక క్రెడిట్ కార్డ్ నుండి మరొక క్రెడిట్ కార్డుకు డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయడం.
- బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేయడానికి, మీరు ఎంచుకున్న కార్డ్‌కి చెందిన వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఛార్జీలు మొదలైన వాటి గురించి తెలుసుకోవడం అవసరం. ఆ కార్డు తక్కువ వడ్డీ రేటును అందిస్తే ఇది లాభదాయకం.
- మీ ఎందుకున్న క్రెడిట్ కార్డుతో మీ బ్యాలెన్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేయడానికి, ఆ యొక్క క్రెడిట్ కార్డ్ కంపెనీ కస్టమర్ కేర్‌ను సంప్రదించి, మీ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయమని అభ్యర్థించండి.
- అవసరమైన వివరాలు, డబ్బు మరియు ఖాతా నంబర్ అందించి అప్లై చేయాలి.
- మీరు ట్రాన్స్‌ఫర్ చేయదలచిన మొత్తం, మీరు ట్రాన్స్‌ఫర్ చేయదలుచుకున్న క్రెడిట్ కార్డు వివరాలు ఇవ్వాలి.
- ఒకసారి ఆమోదించబడిన తర్వాత, మీ బ్యాంక్ ఖాతాకు డబ్బు క్రెడిట్ అవుతుంది.
- బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ పూర్తవడానికి 3 నుండి 5 రోజులు పడవచ్చు. అయితే, కొన్ని క్రెడిట్ కార్డ్ కంపెనీలు తక్షణమే బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్‌ను అందిస్తాయి.
పర్సనల్ లోన్ తీసుకుని ట్రాన్స్‌ఫర్
కొన్ని బ్యాంకులు మరియు NBFCs క్రెడిట్ కార్డు హోల్డర్లకు Instant Personal Loan ఆఫర్ చేస్తాయి. ఇది చాలా తక్కువ వడ్డీకి లభించవచ్చు.
ఎలా అప్లై చేయాలి?
- మీ బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ సంస్థ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా అప్లై చేయండి.
- అవసరమైన KYC డాక్యుమెంట్లు సమర్పించండి.
- లోన్ మంజూరైతే, నేరుగా బ్యాంక్ ఖాతాకు డబ్బు జమ అవుతుంది.
ఫీజులు & వడ్డీ రేట్లు:
- ప్రాసెసింగ్ ఫీజు 1% – 3%.
- వడ్డీ రేటు 10% – 18%.

Credit Card Money Transfer vs Personal Loan
ఫీచర్ | క్రెడిట్ కార్డు ట్రాన్స్ఫర్ | పర్సనల్ లోన్ |
---|---|---|
ప్రాసెసింగ్ ఫీజు | 2% – 5% | 1% – 3% |
వడ్డీ రేటు | 18% – 48% | 10% – 18% |
అవైలబిలిటీ | తక్షణమే | 24 – 48 గంటలు |
సౌలభ్యం | తక్షణంగా బ్యాంక్ ఖాతాకు డబ్బు చేరుతుంది | కాస్త సమయం పడుతుంది |
Credit Card Money Transfer చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- అధిక ఫీజులు చెల్లించకుండా తక్కువ ఖర్చుతో డబ్బు పంపించే మార్గాలను ఎంచుకోండి.
- థర్డ్ పార్టీ అప్లికేషన్లను వాడేటప్పుడు వారి గడువు నిబంధనలను పరిశీలించండి.
- మీ బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ ఆఫర్లు ఉంటే ముందుగా పరిశీలించండి.
- అవసరమైనప్పుడు మాత్రమే క్రెడిట్ కార్డు బ్యాలెన్స్‌ను బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం ఉత్తమం.
- క్రెడిట్ స్కోర్ తగ్గకుండా జాగ్రత్త పడాలి.
గమనిక:
క్రెడిట్ కార్డు నుండి బ్యాంక్ ఖాతాకు డబ్బు ట్రాన్స్‌ఫర్(Credit Card Money Transfer) చేయడం అనేది చాలా అవసరమైన సమయంలో ఉపయోగపడుతుంది. అయితే, అందుబాటులో ఉన్న వివిధ మార్గాలను అర్థం చేసుకుని, తక్కువ ఫీజుతో మరియు తక్కువ వడ్డీతో డబ్బు పొందే మార్గాన్ని ఎంచుకోవడం మంచిది. మీరు ఏ మార్గాన్ని ఎంచుకున్నా, దాని ఫీజులు, వడ్డీ రేట్లు, మరియు నిబంధనలు పూర్తిగా చదివి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.
FAQs
క్రెడిట్ కార్డ్ ద్వారా డబ్బులు మన బ్యాంక్ ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేయవచ్చా?
అవును, కొన్ని ఫినాన్షియల్ యాప్స్ లేదా బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఫీచర్ల ద్వారా క్రెడిట్ కార్డ్ డబ్బును బ్యాంక్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.
క్రెడిట్ కార్డ్ నుండి మనీ ట్రాన్స్‌ఫర్ చేయడం సురక్షితమా?
సరైన యాప్స్ మరియు వెరిఫైడ్ మెథడ్స్ ఉపయోగిస్తే ఇది సురక్షితమే. అయితే హై ఫీజులు లేదా స్కామ్ యాప్స్ నుంచి జాగ్రత్తగా ఉండాలి.
మనీ ట్రాన్స్‌ఫర్ కోసం బెస్ట్ యాప్స్ ఏమిటి?
PhonePe, Paytm, CRED, LazyPay, మరియు Mobikwik లాంటి యాప్స్ ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.
Credit Card Money Transferపై ఎలాంటి ఫీజులు ఉంటాయి?
వారు ఎంచుకున్న పద్ధతి ఆధారంగా ట్రాన్సాక్షన్ ఫీజు లేదా ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉండవచ్చు. సాధారణంగా 1.5% నుంచి 3% వరకు ఉండొచ్చు.
క్రెడిట్ కార్డ్ నుండి డబ్బు ట్రాన్స్‌ఫర్ చేస్తే CIBIL స్కోర్‌పై ప్రభావం ఉంటుందా?
సరైన repayment చేస్తే ప్రభావం ఉండదు. కానీ, డ్యూస్ పెండింగ్ చేస్తే లేదా ఎక్కువగా క్రెడిట్ వాడితే CIBIL స్కోర్ దెబ్బతినే అవకాశం ఉంటుంది.