PM Mudra Loan: ముద్రా లోన్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ముద్రా అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ. ఈ పథకాన్ని ప్రధానమంత్రి గారు ఏప్రిల్ 8, 2015లో ప్రారంభించారు. దీని ప్రధాన లక్ష్యం కొత్తగా వ్యాపారం (MSMEs) ప్రారంభించాలనుకునేవారికి లేదా ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలనుకునేవారికి ఆర్థిక సహాయం అందించడం. ఈ లోన్ కోసం ఎటువంటి హామీ లేదా సెక్యూరిటీ అవసరం లేదు, మరియు గరిష్టంగా ₹10 లక్షల వరకు లోన్ అందుబాటులో ఉంటుంది.
యూనియన్ బడ్జెట్ 2024 లో భాగంగా ముద్రా లోన్‌లో కొన్ని మార్పులు వచ్చాయి. బడ్జెట్ ప్రకటనలో, నిర్మలా సీతారామన్ గారు ముద్రా లోన్ గరిష్ట పరిమితిని ₹10 లక్షల నుండి ₹20 లక్షలకు పెంచారు. అయితే, ఇది మొదటిసారి అప్లై చేసుకునే వారికి వర్తించదు. మొదటిసారి ముద్రా లోన్ తీసుకునే వారికి గరిష్ట పరిమితి ₹10 లక్షలే. ఎవరైతే ఇప్పటికే ముద్రా లోన్ తీసుకుని పూర్తిగా తిరిగి చెల్లించారు, వారు రెండవసారి అప్లై చేసుకుంటే గరిష్టంగా ₹20 లక్షల వరకు లోన్ పొందే అవకాశం ఉంటుంది.
ముద్రా లోన్ పొందేందుకు, సరైన ప్రాజెక్ట్ రిపోర్ట్ చాలా ముఖ్యం. అప్లికేషన్ ప్రక్రియ, అవసరమైన డాక్యుమెంట్లు, మరియు ముద్రా లోన్ అందుబాటులో ఉన్న బ్యాంకుల వివరాలను తెలుసుకోవడం అవసరం. కొందరు బ్యాంకులు ముద్రా లోన్ అందుబాటులో లేదని చెబుతుండటంతో, సంబంధిత బ్యాంకుల జాబితా తెలుసుకుని అక్కడ అప్లై చేయడం మంచిది.
ముద్రా లోన్లు మూడు రకాలుగా విభజించబడ్డాయి
- శిషు (Shishu): ఈ రకం లోన్ 50,000 రూపాయల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ లోన్ కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించే వ్యక్తులకు అనుకూలంగా ఉంటుంది. ఈ లోన్ ద్వారా వ్యాపార ప్రారంభ ఖర్చులు, చిన్న పరికరాలు కొనడం మరియు ఇతర ప్రాథమిక అవసరాలను తీర్చడం సాధ్యమవుతుంది.
- కిశోర్ (Kishor): ఈ రకం లోన్ 50,000 రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ లోన్ వ్యాపారాన్ని కొంత విస్తరించాలనుకునే వ్యక్తులకు అనుకూలంగా ఉంటుంది. ఈ లోన్ ద్వారా వ్యాపారాన్ని మెరుగుపరచడం, కొత్త పరికరాలు కొనడం మరియు వ్యాపారాన్ని విస్తరించడం సాధ్యమవుతుంది.
- తరుణ్ (Tarun): ఈ రకం లోన్ 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ లోన్ వ్యాపారాన్ని పెద్ద స్థాయికి తీసుకెళ్లాలనుకునే వ్యక్తులకు అనుకూలంగా ఉంటుంది. ఈ లోన్ ద్వారా వ్యాపారాన్ని విస్తరించడం, కొత్త పరికరాలు కొనడం మరియు వ్యాపారాన్ని మెరుగుపరచడం సాధ్యమవుతుంది.
ఎవరైతే తరుణ్ కేటగిరీలో పూర్తి రీపేమెంట్ చేసి ఉంటారో, వారు రెండవసారి అప్లై చేసుకుని ఎక్కువ (గరిష్టంగా ₹20 లక్షల వరకు) మొత్తంలో లోన్ పొందే అవకాశం ఉంది.
ముద్రా లోన్స్‌లో వడ్డీ రేట్ల ఏ విధంగా ఉంటాయి.
ముద్రా లోన్స్‌పై వడ్డీ రేట్లు ప్రభుత్వ బ్యాంకులు మరియు ప్రైవేట్ బ్యాంకుల మధ్య తేడా కలిగి ఉంటాయి. సాధారణంగా, ప్రభుత్వ బ్యాంకులు (SBI, Bank of Baroda, Punjab National Bank వంటి బ్యాంకులు) ముద్రా లోన్స్‌పై తక్కువ వడ్డీ రేటును అందిస్తాయి. వీటి వడ్డీ రేటు సుమారు 7.5% నుండి 12.8% మధ్యలో ఉంటుంది. ప్రభుత్వ బ్యాంకుల ప్రధాన లక్ష్యం చిన్నతరహా వ్యాపారాలను ప్రోత్సహించడం కాబట్టి, తక్కువ వడ్డీ రేటుతో ఈ లోన్లు ఇస్తాయి.
ఇక ప్రైవేట్ బ్యాంకుల విషయానికి వస్తే, వీటిలో వడ్డీ రేట్లు ప్రభుత్వ బ్యాంకుల కంటే కొంత ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా, ప్రైవేట్ బ్యాంకుల వడ్డీ రేట్లు 11% నుండి 28% మధ్య ఉంటాయి. కొన్ని సందర్భాల్లో, క్రెడిట్ స్కోర్, బిజినెస్ ప్రొఫైల్ వంటి అంశాలను బట్టి వడ్డీ రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది.
ఇక అసలు ముద్రా లోన్ వడ్డీ రేట్ల గురించి చెప్పుకోవాలంటే, ఇది రుణగ్రాహకుడి ప్రొఫైల్, బ్యాంక్ పాలసీలు, మరియు ప్రభుత్వ మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, ముద్రా లోన్ వడ్డీ రేట్లు 7.5% నుండి 14% మధ్యలో ఉంటాయి. అయితే, ఎక్కువ మొత్తంలో రుణం తీసుకుంటే, బ్యాంకుల నిబంధనల ప్రకారం వడ్డీ రేటు మారవచ్చు. కాబట్టి, ముద్రా లోన్ తీసుకునే ముందు వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను సరిపోల్చుకుని, తక్కువ వడ్డీ రేటుతో అందిస్తున్న బ్యాంకును ఎంచుకోవడం మంచిది.
PM Mudra Loan ఎవరు అప్లై చేసుకోవచ్చు.
సింపుల్‌గా చెప్పాలంటే, నాన్-కార్పొరేట్ వ్యాపారాలు అంటే చిన్న వ్యాపారాలు, పెద్ద కార్పొరేట్ కంపెనీలు కాదు. ముద్రా లోన్ వ్యవసాయానికి కాదుగానీ, చిన్న వ్యాపారాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ కోసం ఈ లోన్ అందిస్తారు. మొదటిసారి వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలనుకునేవారు ఈ లోన్‌కు అర్హులు. ఉదాహరణకు, మీరు టిఫిన్ సెంటర్ పెట్టాలనుకుంటే, బిజినెస్ ఐడియా మాత్రమే ఉంది కానీ డబ్బులేమీ లేవు అనుకుంటే, మీరు బ్యాంకులో ప్రాజెక్ట్ వివరాలతో అప్లై చేయవచ్చు.
ముద్రా లోన్ కోసం అర్హత పొందేందుకు అభ్యర్థి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వ్యక్తి అయి ఉండాలి. మీరు బ్యాంకులో అప్లై చేయాలంటే, మీ వ్యాపారానికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేసుకోవాలి(ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసం మీరు గూగుల్ లో వెతికి ప్రాజెక్ట్ రిపోర్ట్ నమూనా సేకరించవచ్చు). బ్యాంక్ మేనేజర్ ఆ రిపోర్ట్ చూసి, మీకు వ్యాపారం మీద నాలెడ్జ్ ఉందో లేదో అంచనా వేసి, లోన్ మంజూరు చేస్తాడు. ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏ విధంగా ఉండాలి అని ఒక అంచనా కు రావడం కోసం ఇక్కడ క్లిక్ చేసి PDF ఫైల్ ను డౌన్లోడ్ చేసుకోండి.
ఫస్ట్ టైం అప్లై చేసేవారికి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ కింద గరిష్టంగా ₹10 లక్షల వరకు లోన్ పొందొచ్చు. అదే, ఇప్పటికే వ్యాపారం ఉన్న వారు విస్తరణ కోసం అప్లై చేస్తే, వారి లోన్ రిక్వైర్మెంట్ ₹10 లక్షల లోపే ఉండాలి. ఒకవేళ మీరు ముద్రా లోన్ తీసుకుని పూర్తిగా చెల్లించివేశారనుకోండి, మరల తీసుకునే అవకాశం ఉంది, కానీ టరుణ్ ప్లస్ కేటగిరీలో మాక్స్ ₹20 లక్షలు మాత్రమే వస్తాయి.
ఈ లోన్ ప్రధానంగా చిన్న వ్యాపారాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఉదాహరణలు:
- కమర్షియల్ వెహికల్స్: ట్రాక్టర్లు, పవర్ ట్రిల్లర్స్, ట్రాక్టర్ ట్రాలీలు మొదలైనవి (కానీ రూ.10 లక్షలకు లోపే).
- ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్: ఆటో, క్యాబ్ కార్లు, టాటా ఏస్ వంటివి, అయితే ఇవి కమర్షియల్ యూజ్ కోసం మాత్రమే (ఎల్లో బోర్డ్ ఉండాలి).
- వర్కింగ్ క్యాపిటల్ బిజినెస్‌లు: సలూన్, జిమ్, స్వీట్ షాప్, బ్యూటీ పార్లర్, టీ షాప్, టిఫిన్ సెంటర్, సైకిల్ & బైక్ రిపేర్ సెంటర్.
- ప్లాంట్ అండ్ మిషినరీ: పాపడ్ మేకింగ్, జామ్ మేకింగ్, బ్రెడ్ అండ్ బన్ మేకింగ్, ఐస్ క్రీమ్ మేకింగ్, క్యాటరింగ్ వంటి తయారీ పరిశ్రమలు.
- వ్యవసాయ అనుబంధ వ్యాపారాలు: పౌల్ట్రీ ఫార్మింగ్, డైరీ ఫార్మింగ్, బి కీపింగ్, ఫిషరీస్ – కానీ ఇవి ప్రారంభించడానికి మీకు అవగాహన ఉండాలి.
- హ్యాండ్లూమ్ & హస్తకళలు: ఖాదీ, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, బ్యాగ్ తయారీ వ్యాపారాలు.
ఏ ఏ బ్యాంకు లు ముద్ర లోన్స్ అందిస్తున్నాయి?
ప్రస్తుతం మొత్తం 27 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఉన్నాయి. ఉదాహరణకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ధనా బ్యాంకు, IDBI బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, యూకో బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు వంటి బ్యాంకుల్లో మీరు లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.
అలాగే, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల్లో యాక్సిస్ బ్యాంక్, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, YES బ్యాంక్, IDFC బ్యాంక్ వంటి మొత్తం 18 బ్యాంకులు ఉన్నాయి. వీటిలో కూడా మీరు లోన్ కోసం అప్లై చేయవచ్చు.
ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే, మొదటి ప్రాధాన్యత పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు ఇవ్వడం మంచిది, ఎందుకంటే ఇవి ప్రభుత్వ పరిరక్షణతో స్థిరమైన సేవలు అందిస్తాయి. రెండో ప్రాధాన్యతగా ప్రైవేట్ బ్యాంకులను ఎంచుకోవచ్చు, వీటి ద్వారా వేగంగా సేవలు పొందే అవకాశం ఉంటుంది.
ముద్రా లోన్ కోసం అవసరమైన పత్రాలు
ముద్రా లోన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అప్లికేషన్‌తో పాటు ఈ డాక్యుమెంట్స్ సమర్పించాలి.
- ఆధార్ కార్డు: అభ్యర్థి యొక్క ఆధార్ కార్డు కాపీ.
- పాన్ కార్డు: అభ్యర్థి యొక్క పాన్ కార్డు కాపీ.
- వ్యాపార పత్రాలు: వ్యాపారం సంబంధిత పత్రాలు, ఉదాహరణకు వ్యాపార లైసెన్స్ (GST సర్టిఫికేట్), రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ మొదలైనవి.
- ఫోటోలు: అభ్యర్థి యొక్క పాస్పోర్ట్ సైజు ఫోటోలు.
- ఆదాయ పత్రాలు: అభ్యర్థి యొక్క ఆదాయ పత్రాలు, ఉదాహరణకు బ్యాంక్ స్టేట్మెంట్ (6 నెలల నుండి 1 సంవత్సరం వరకు), ఇన్కమ్ టాక్స్ రిటర్న్ మొదలైనవి.
- ప్రాజెక్ట్ రిపోర్ట్: మీరు ప్రారంభించబోయే లేదా అభివృద్ధి చేయాలనుకున్న వ్యాపారం యొక్క పూర్తి ప్రణాళిక (Loan Purpose)
ముద్రా లోన్ అప్లై చేయడం ఎలా?
- ముద్రా యోజన అధికారిక వెబ్‌సైట్: www.mudra.org.in ద్వారా మీరు నేరుగా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయవచ్చు.
- బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీని ఎంచుకోవడం: మీరు సౌకర్యవంతమైన బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీని ఎంచుకోవచ్చు లేదా మీరు మీ బ్యాంక్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేయవచ్చు.
- MSME కేంద్రం: అప్లై చేయడానికి మీకు దగ్గరలోని బ్యాంక్ లేదా MSME కేంద్రం సందర్శించవచ్చు.
- అర్హత తనిఖీ: అభ్యర్థి ముద్రా లోన్ కోసం అర్హత కలిగి ఉందో లేదో తనిఖీ చేయాలి.
- పత్రాలు సమర్పించడం: అభ్యర్థి అవసరమైన పత్రాలను సమర్పించాలి.
- దరఖాస్తు ఫారమ్ పూరించడం: అభ్యర్థి ముద్రా లోన్ కోసం దరఖాస్తు ఫారమ్ పూరించాలి.
- దరఖాస్తు సమర్పించడం: అభ్యర్థి దరఖాస్తు ఫారమ్ మరియు పత్రాలను బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీకి సమర్పించాలి.
- లోన్ ఆమోదం: బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ దరఖాస్తును సమీక్షించి, లోన్ ఆమోదించిన తర్వాత నిధులు అభ్యర్థి యొక్క ఖాతాకు జమ చేయబడతాయి.
ఫైనాన్సియల్ ప్లానింగ్ కోసం కాలిక్యులేటర్లను ఉపయోగించండి.
ముద్రా రూపే కార్డు
ప్రధాన మంత్రి ముద్రా యోజన (PMMY) కింద ముద్రా రుణం పొందిన వ్యాపారులకు అందించబడే ఒక డెబిట్ కార్డు. ఇది రూపే నెట్‌వర్క్‌లో పనిచేస్తుంది మరియు వ్యాపార అవసరాలకు ఉపయోగపడేలా రూపొందించబడింది. ఈ కార్డు ద్వారా, పొందిన రుణాన్ని లబ్ధిదారులు ATM నుండి నగదు ఉపసంహరించుకోవచ్చు, POS మెషీన్లలో చెల్లింపులు చేయవచ్చు, లేదా ఆన్‌లైన్ లావాదేవీలను నిర్వహించుకోవచ్చు. ఇది డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం ద్వారా చిన్నతరహా వ్యాపారస్తులకు లావాదేవీలను సులభతరం చేస్తుంది.
ముద్రా రూపే కార్డు షిషు, కిషోర్, తరుణ్ రుణ గ్రహీతలకు అందించబడుతుంది. ఇది నగదు లావాదేవీలను తగ్గించి, సురక్షితమైన డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తుంది. చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధిదారులు దీని ద్వారా దేశవ్యాప్తంగా వ్యాపార లావాదేవీలు నిర్వహించుకోవచ్చు మరియు క్రెడిట్ హిస్టరీ నిర్మించుకోవచ్చు.
ముగింపు
PM Mudra Loan అనేది చిన్న వ్యాపారాలకు ఆర్థిక సహాయం అందించడానికి భారత ప్రభుత్వం చే ప్రారంభించబడిన ఒక ప్రత్యేక రుణ పథకం. ఈ పథకం ద్వారా చిన్న వ్యాపారాలు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి, కొత్త పరికరాలు కొనడానికి మరియు వ్యాపారాన్ని మెరుగుపరచడానికి అవసరమైన నిధులను పొందగలుగుతాయి. ముద్రా లోన్ ద్వారా చిన్న వ్యాపారాలు తమ ఆర్థిక స్వాతంత్య్రాన్ని పొందగలుగుతాయి మరియు ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. ఈ పథకం చిన్న వ్యాపారాలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మరియు వారు తమ వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. సో లోన్ అప్రూవ్ అవ్వాలంటే మీ చేతుల్లోనే ఉంది బ్యాంకు మేనేజర్ చేతుల్లో కాదు మీకంటూ మంచి బిజినెస్ ఐడియా ఉండాలి అది ఫ్యూచర్ లో సక్సెస్ అయిద్ది అని చెప్పి బ్యాంకు మేనేజర్ కి అనిపించాలి.