మార్చి 2024లో పబ్లిక్ సెలవులు:
రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా హాలిడే జాబితా ప్రకారం ఈ మర్చి నెలలో బ్యాంకులకు 14 సెలవలు ఉన్నట్లు తెలుస్తుంది. సెలవలను రాష్ట్ర ప్రభుత్వాలు మరియు RBI నిర్ణయిస్తాయి. వీటిలో కొన్ని ప్రభుత్వ సెలవలు కాగా మరికొన్ని ప్రాంతీయ సెలవలు ఉంటాయి.
ఇక మన తెలుగు రాష్ట్రాల సెలవుల జాబితా ప్రకారం 2 సెకండ్ సాటర్ డేస్, 5 ఆదివారాలు మరియు మహా శివరాత్రి (మార్చి 8), హోలీ (మార్చి 25), గుడ్ ఫ్రైడే (మార్చి 29) కలుపుకొని దాదాపుగా 10 రోజులపాటు బ్యాంకు కార్యకలాపాలకు కళ్లెం పడవచ్చు. అందుకే ఆయా బ్యాంకు క్లయింట్స్ రాబోయే సెలవలను దృష్టిలో ఉంచుకొని తమ బ్యాంకు పనులను ముందుగా ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.