Personal Loan: పర్సనల్ లోన్ అంటే వ్యక్తిగత అవసరాల కోసం తీసుకునే రుణం. ఇది బ్యాంకులు లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లు వడ్డీ రేటు, పదవీ కాలం వంటి నిబంధనలు, షరతుల ఆధారంగా ఇస్తాయి. ఈ రుణాన్ని గృహ నిర్మాణం, వివాహం, విద్య, వైద్య అవసరాలు, వెకేషన్, లేదా ఇతర వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించవచ్చు. వ్యక్తిగత రుణాన్ని అనుకోని ఖర్చులు, వివాహ ఖర్చులు, విద్య ఖర్చులు, సేవింగ్ లేకుండా ఖర్చులు, పాత రుణాలను క్లియర్ చేయడానికి, లేదా వ్యాపారం కోసం తీసుకుంటారు. మీ అనుకోని ఖర్చులకి డబ్బు అవసరం ఇబ్బంది పెడుతుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటె ఇప్పుడు ఆన్లైన్ ద్వారా రుణాలు చాలా సులభంగా పొందవచ్చు. మొబైల్ యాప్ ద్వారానే ఇంట్లో కూర్చొని లోన్ పొందే అవకాశాలు ఎన్నో కంపెనీలు మనకు అందిస్తున్నాయి. అందులో ఒకటి Navi App.
Navi App అనేది ఒక డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫారమ్, Navi Finserv Pvt Ltd అనే కంపెనీ పేరుతో లోన్ సర్వీస్ ను అందిస్తుంది. ఈ యాప్ ద్వారా మీరు మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో కూర్చుని, కొన్ని నిమిషాల్లోనే లోన్ పొందవచ్చు. నవి యాప్‌లో పర్సనల్ లోన్ పొందడం చాలా సులభం. మీరు ₹10,000 నుండి ₹20 లక్షల వరకు లోన్ పొందగలరు. ఈ లోన్ మొత్తాన్ని మీ ఆర్థిక అవసరాల బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు తీసుకున్న లోన్ మొత్తాన్ని 6 నుండి 72 నెలల వరకు ఈఎంఐలుగా చెల్లించవచ్చు. ఇప్పుడు, Navi Appలో లోన్ ఎలా పొందాలో, ఎంత వరకు లోన్ పొందగలరో, ఎవరు తీసుకోవచ్చో, ఎలా అప్లై చేయాలి, అవసరమైన డాక్యుమెంట్లు ఏమిటి, అలాగే నావి యాప్ లోన్ యొక్క ఫీచర్లు మరియు ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
నవి యాప్ ఫీచర్లు మరియు ప్రయోజనాలు
- ఇన్స్టంట్ లోన్: 3-4 రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు. మీరు అర్హత కలిగి ఉంటే, కొన్ని నిమిషాల్లో మీ బ్యాంక్ ఖాతాకు డబ్బు పంపిణీ చేయబడుతుంది. మీరు విన్నది నిజమే, లోన్ సాంక్షన్ చాలా వేగంగా ముఖ్యంగా నిమిషాల్లోనే జరుగుతుంది.
- ఫిజికల్ వెరిఫికేషన్ అవసరం లేదు: KYC ప్రాసెస్ డిజిటల్‌గా పూర్తి అవుతుంది, అందువల్ల ఫిజికల్ డాక్యుమెంట్లను సమర్పించడం అవసరం లేదు.
- ఫ్లెక్సిబుల్ రీపేమెంట్: EMIలను సెలెక్ట్ చేసుకోవడానికి ఫ్లెక్సిబుల్ ఆప్షన్లు ఉంటాయి, 6 నుండి 72 నెలల వరకు సౌకర్యవంతమైన రీపేమెంట్ కాలపరిమితిన అందుబాటులో ఉంటుంది.
- తక్కువ వడ్డీ రేట్లు: నవి యాప్‌లో వడ్డీ రేట్లు 9.99% నుండి ప్రారంభమవుతాయి, ఇది చాలా అనుకూలమైనది.
- హిడెన్ ఛార్జెస్ లేవు: ట్రాన్స్పరెంట్ ఛార్జెస్ ఉంటాయి, హిడెన్ ఛార్జెస్ ఏమీ లేవు, అందువల్ల మీరు నిశ్చింతగా లోన్ పొందవచ్చు.
- సులభమైన ప్రాసెస్: ప్రతి స్టెప్ డిజిటల్‌గా జరుగుతుంది, అందువల్ల మీకు బ్యాంక్‌కు వెళ్లడం లేదా ఫిజికల్ వెరిఫికేషన్ అవసరం లేదు.
ఎవరు లోన్ తీసుకోవడానికి అర్హులు?
- భారతీయ పౌరుడు అయ్యి ఉండి, 18 నుండి 65 ఏళ్లు వయస్సు ఉన్నవారు ఎవరైనా నవి లోన్ తీసుకోవచ్చు.
- మీరు ఉద్యోగి, స్వయం ఉపాధి పొందిన వ్యక్తి అయినా తీసుకోవచ్చు. వార్షిక ఆదాయం > 3 లక్షలు కంటే ఎక్కువ ఉన్నవారు అర్హులు.
- నవి యాప్‌లో లోన్ పొందడానికి కనీస క్రెడిట్ స్కోర్ 750 కంటే ఎక్కువ అవసరం ఉంటుంది. కానీ, మీరు నవిలో ఫస్ట్-టైమ్ యూజర్ అయితే, మీకు క్రెడిట్ స్కోర్ అవసరం లేదు.
ఇది కూడా చదవండి : ప్రీ అప్రూవ్డ్ లోన్స్ అంటే ఏంటి? ఎలా పొందాలో తెలుసుకోండి!
అవసరమైన డాక్యుమెంట్లు
- ఆధార్ కార్డు
- పాన్ కార్డు
- బ్యాంక్ స్టేట్మెంట్ (ఇటీవలి 3-6 నెలలు)
- ఆదాయ ప్రమాణం (జీతం స్లిప్ లేదా ITR)
లోన్ అప్లై ప్రాసెస్
- నవి యాప్ డౌన్లోడ్: మొదట, నవి యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి.
- రిజిస్ట్రేషన్: మీ మొబైల్ నంబర్ తో రిజిస్ట్రేషన్ చేసుకుని, OTP తో వెరిఫై చేసుకోండి.
- ఎలిజిబిలిటీ చెక్: మీ ఆధార్ లేదా పాన్ వివరాలు ఎంటర్ చేయండి. మీ ఎలిజిబిలిటీని నిర్ధారించడానికి యాప్ మీ క్రెడిట్ స్కోర్‌ను యాక్సెస్ చేస్తుంది.
- లోన్ మొత్తం సెలెక్ట్: ఎలిజిబిలిటీ నిర్ధారణ అయితే, మీరు పొందగలిగిన లోన్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోండి.
- కేవైసీ కంప్లీషన్: మీ ఆధార్ లేదా పాన్ కార్డు వివరాలు సబ్మిట్ చేయండి. డిజిటల్ KYC పూర్తయ్యితే, లోన్ సాంక్షన్ ప్రాసెస్ ప్రారంభమవుతుంది.
- లోన్ డిస్బర్సల్: లోన్ ఆమోదించబడిన తర్వాత, మీ బ్యాంక్ ఖాతాలో లోన్ మొత్తం డిస్బర్స్ అవుతుంది.
నవి యాప్ ద్వారా లోన్ పొందడం చాలా ఈజీ మరియు వేగవంతమైన ప్రాసెస్. మీ ఆధార్, పాన్ కార్డు తో సింపుల్ స్టెప్పులు ఫాలో అవుతూ లోన్ ను సెలెక్ట్ చేసుకుని, మీ బ్యాంక్ ఖాతాలో ఇన్‌స్టంట్‌గా పొందగలరు. మీ అవసరాలకు తగ్గట్టుగా సరైన మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుని, ఫ్లెక్సిబుల్ EMI ఆప్షన్లతో టెన్షన్ లేకుండా రీపేమెంట్ చేయవచ్చు. మీ ఆర్థిక అవసరాలకి, నవి యాప్ ఒక బెస్ట్ సొల్యూషన్ అని చెప్పవచ్చు.
ఈ ప్రాసెస్ లో ఒక ముఖ్యమైన విషయం, మీ ఎలిజిబిలిటీ ని కరెక్ట్ గా చెక్ చేసుకుని లోన్ అప్లై చేయడం, ఇలాంటి డిజిటల్ లోన్ యాప్స్ లో ట్రాన్స్పరెన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మీకు బెస్ట్ ఆప్షన్ అనిపిస్తేనే ఉపయోగించండి.